మా గమ్యం ఢిల్లీ .. నేరుగా ప్రధాని తోనే చర్చలు: రైతులు

ఆకలి చావులతో అయినా చస్తాము కానీ… ఆందోళనను విరమించమని, ఢిల్లీకి తప్పకుండా చేరుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిస్థితి కొంత ఆందోళన కరంగా మారింది. పోలీసులు బారికేడ్లు పెట్టినా, ఆంక్షలు విధించినా, వాటర్ కెనన్లు వాడినా, తమ గమ్యం మాత్రం ఢిల్లీయే అని తేల్చి చెబుతున్నారు. రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు సరికదా… మరింత పట్టు బిగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఢిల్లీకి చేరుకుంటామని, తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని, ప్రభుత్వం రోడ్డుపైకి వచ్చి మాట్లాడేంత వరకూ, తమ డిమాండ్లను నెరవేర్చే వరకూ ఉద్యమిస్తూనే ఉంటామని రైతులు పేర్కొంటున్నారు. తాము ఎవరితోనూ చర్చలు జరపమని, నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతోనే తాము చర్చలు జరుపుతామని కరాఖండిగా తేల్చి చెబుతున్నారు.

భారతీయ కిసాన్ యూనియన్ నేత గుర్నమ్ సింగ్ మాట్లాడుతూ….. రైతుల లక్ష్యం ఢిల్లీకి చేరుకోవడమేనని, ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ఏం చేసినా… తాము మాత్రం హస్తినకు చేరుకుంటామని స్పష్టం చేస్తున్నారు. రైతులు ఇంత స్పష్టంగా ప్రకటిస్తుండటంతో ప్రభుత్వం వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. మరో రైతు సంఘం నేత గురునామ్ సింగ్ చఢూనీ మాట్లాడుతూ… ఢిల్లీ దేశ రాజధాని, మిగితా వాటిని బీజేపీ పాకిస్తాని అని పిలుస్తుందని, కానీ… తాము పాకిస్తాన్ నుంచి రాలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని గురునామ్ డిమాండ్ చేశారు.