హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించే ముంపు గ్రామాలను సందర్శించిన పాడేరు జనసేన నాయకులు

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం, చింతపల్లి గొందిపాకలు పంచాయితీ ఎర్రవరం సమగిరి, గొడుగుమామిడి, ఎర్నాపల్లి గ్రామాలను పాడేరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య ఆదేశాల మేరకు జనసేనపార్టీ నాయకులు పర్యటించారు. ఈ పర్యటనలో ఆ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించదలుచుకున్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వలన ముంపునకు గురయ్యే గ్రామాలు సుమారుగా 32. గత కొన్ని నెలలుగా ఆ ప్రాంత ప్రజలు ఆందోళనలు చేస్తూ ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తే మా ప్రాంతంలో మా బ్రతుకుతెరువు పోతుంది మా భూములు, తోటలు, పంటపొలాలు ముంపుకి గురవుతున్నాయి, అన్ని కోల్పోయి శాశ్వతతంగా మా గిరిజన ప్రజలు నిరాశ్రయులవుతారు. మాకు ఎటువంటి ఆధారం లేదు మా సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రాలు ఇచ్చాము, ఈ ప్రాంత ప్రజలందరు భయాందోళనలకు గురవుతున్నారని ఆ ప్రాంత గిరిజనులు తెలిపారు. చింతపల్లి మండల జనసేనపార్టీ నాయకులు వంతల బుజ్జిబాబు, బద్రీనాద్, స్వామి, మాట్లాడుతూ ఈ నెల 15, 16, 17,తేదీలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటన చేయనున్నారు మరీ ముఖ్యంగా 16వ తేదీన ఉత్తరాంధ్ర ప్రజాసమస్యల కోసం జనవాణి కార్యక్రమం చేపట్టనున్నారని అక్కడ మన నియోజవర్గ ప్రధాన సమస్యలలో ఒకటైన ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సమస్య ఒకటని ఈ అంశాన్ని అధినేత దగ్గర తీసుకెళ్లి పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తామని అందుకు బాధిత గ్రామప్రజలు మీ సమస్యను చెప్పుకోవడానికి మాతో పాటుగా విశాఖపట్టణం రావాలని ధైర్యంగా మన సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేద్దామని ప్రజలకు తెలిపారు. అలాగే జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న మాట్లాడుతూ మన ప్రాంతం భౌగోళికంగా విశిష్టమైన వాతావరణం గలదని ఇక్కడున్న అనేక రకాలైన ఖనిజ సంపదను దోచుకోవడానికి అనేక బహుళ కంపెనీలు ప్రభుత్వ అండతో ప్రయత్నం చేస్తున్నాయని మీ పోరాటానికి జనసేన పార్టీ తరపున మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మీరు జనవాణి కార్యక్రమానికి హాజరై ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కలిగే సమస్యలు నేరుగా అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి స్వయంగా చెప్పుకునే అరుదైన అవకాశం వచ్చిందని మీరు తప్పకుండా రావాలని తెలిపారు. ఈ పర్యటనలో చింతపల్లి మండల నాయకులు వంతల బుజ్జిబాబు, బద్రీనాద్, స్వామి, జి.మాడుగుల మండల అధ్యక్షులు మాసాడి భీమన్న, పాడేరు నియోజకవర్గ జనసేనపార్టీ ఐటి విభాగం అధ్యక్షులు సాలేబు అశోక్ పాల్గొన్నారు.