పాన్-ఆధార్ లింక్ చేయని వారికి మరో అవకాశం ఇచ్చిన కేంద్రం..

పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయని వారికి కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. మార్చి 31లోపు లింక్ చేయాల్సిందేనని స్పష్టం చేసిన కేంద్రం.. మరోసారి గడువును పొడిగించింది. కరోనా వైరస్ కారణంగా ప్రజలు బయటకు వెళ్లకపోవడంతో లింక్ చేయడం ఇబ్బందిగా మారింది. అటు చివరిరోజు బుధవారం సర్వర్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరింత గడువును ఇచ్చింది. ఆధార్‌తో పాన్ అనుసంధానం పొడిగింపు గడువును జూన్‌ 30 వరకు కల్పించింది. కాగా మార్చి 31 వరకు లింక్‌ చేయకపోతే లేటు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని తొలుత హెచ్చరించింది. తాజాగా మరికొన్ని రోజులు అవకాశం దొరకడంతో లింక్ చేయని వారికి ఊరట లభించింది.