గంగా స్నాన్ మేళా రద్దు

యూపీ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది గంగ స్నాన్ మేళా, దీపదాన్ పండుగను రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. హాపూర్ జిల్లా, మీరట్ జిల్లాలోని హస్తినాపూర్‌లో ఈ పండుగలను ఏటా జరుపుకుంటారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఈ పండును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మేళా వేదిక వద్ద నవంబర్ 25 నుంచి 30 మధ్య భక్తుల రాకపై నిషేధం విధించినట్లు హాపూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సర్వేశ్ మిశ్రా తెలిపారు.