ఇలా చేస్తే మీ ఆధార్‌తో పాన్ కార్డు లింక్: SMS మరియు online ప్రాసెస్ విధానం.!

మీకు పాన్ కార్డు ఉందా.? ఆధార్‌ నెంబర్‌తో దానిని లింక్ చేశారా.? లింక్ చేయకపోతే ఖంగారుపడకండి.! ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గుడ్ న్యూస్ అందించింది. ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డు అనుసంధానం చేసే గడువును 2021 జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదాయపు పన్ను శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. కాగా, మీ ఆధార్‌తో పాన్‌ నెంబర్‌ అనుసంధానం చేయకపోతే SMS ద్వారా కూడా చేసుకోవచ్చు. లేదా మీ ఖాతా ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి కూడా చేయవచ్చు.

SMS ఎలా చేయాలి..

ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా పాన్‌ ఆధార్‌ లింక్‌ చేసుకోవచ్చు. ఇందు కోసం మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి UIDAIPAN అని టైప్​ చేసి మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్​ చేయండి. ఆ తర్వాత స్పేస్​ ఇచ్చి మీ 10 అంకెల పాన్​ కార్డు నెంబర్​ను ఎంటర్​ చేయండి. దీన్ని 567678 లేదా 56161 నంబర్​కు SMS పంపించండి. అంతే మీ పని పూర్తయినట్లే. వెంటనే మీ ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం అయినట్లు మీ మొబైల్‌ నెంబర్‌కు సందేశం వస్తుంది.

Online ప్రాసెస్..

మీ పాన్ మరియు ఆధార్ కార్డ్ అనుసంధానం చేసుకోకపోతే కింది విధానంలో ఆన్‌లైన్ ద్వారా లింక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.

1. పాన్, ఆధార్ కార్డ్ అనుసంధానం చేసుకుకోవాలనుకుంటే ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి.

https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html

2. అన్ని వివరాలు నమోదు చేసిన తరువాత కోడ్‌ను ఎంటర్ చేయాలి

3. మీ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్‌తో అనుసంధానం అయిందని మెస్సేజ్ వస్తుంది.

మీ ఆదార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html