తదేకం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలలో పాల్గొన్న పంతం నానాజీ

  • 200 మంది మహిళలి ఆర్థికంగా అభివృద్ధి చెండేందుకు శిక్షణ
  • జిల్లెళ్ళ ప్రసాద్ అమ్మాయి చదువు నిమిత్తం 70,000 రూపాయల ఆర్ధికసాయం
  • గరికిన అప్పారావుకి తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో ట్రై సైకిల్

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనమేరకు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం తదేకం ఫౌండేషన్ కృషి చేయడం జరుగుతుందని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పేర్కొన్నారు. అందులో భాగంగా గురువారం సంతనపురి కాలనీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహా అవతార్ బాబాజీ తదేకం ఫౌండేషన్ సహకారంతో మత్స్యకార మహిళలకు టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని సూర్యారావు పేటలో 200 మంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెండేందుకు శిక్షణ ఇవ్వడం జరిగింది. సూర్యారావు పేట వాస్తవ్యులు గరికిన అప్పారావుకి తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో ట్రై సైకిల్ ఇవ్వడం, అదేవిధగా నానాజీ కోరిక మేరకు కరప గ్రామ నివాసి జిల్లెళ్ళ ప్రసాద్ అమ్మాయి చదువు నిమిత్తం (ఇంటర్మీడియట్) సుమారు 70000 రూపాయలు చెక్కు ఇచ్చి సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ సభ్యులు రాజబాబు, సంగిశెట్టి అశోక్, మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ రాజు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగు శ్రీనివాసరావు, నూకల నారాయణరావు, ఎంపీటీసీ ఓసుపల్లి రాజేశ్వరి రాము, కార్యదర్శి ముసలయ్య, నల్లం శ్రీరాములు, ఈశ్వర్, సతీష్, వెంకట్, చిన్నారావు, సుబ్రహ్మణ్యం, సంతోష్, అద్దంకి వీరబాబు, శరత్, మణికంఠ, మహేష్, రాజారావు తదితరులు పాల్గొన్నారు.