నందలూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక

రాజంపేట, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక నందలూరు మండల జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో నందలూరు మండల జనసేన నాయకులు ఉల్లి ఉపేంద్ర, మంకు వెంకటేష్, మండెం రాము,యెద్దల నరసింహా, కొట్టే హరి సహకారంతో అంగరంగా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన, రాజంపేట జనసేన పార్టీ యువ నాయకుడు అతికారి దినేష్ లను నందలూరు మండల‌ జనసైనికులు పటకుల చప్పుళ్ళు, డ్రమ్స్ వాయిద్యాల మధ్య జెండామాన్ నుంచి దాసరి గడ్డ వరకు ర్యాలీ ద్వార ఘన స్వాగతం పలికారు. సభాస్థలికి చేరిన తరువాత నందలూరును ప్రతిరోజు శుభ్రపరుస్తు పవన్ కళ్యాణ్ కి అత్యంత ఇష్టమైన పారిశుద్ధ్య కార్మికులను అతికారి దినేష్, కీర్తన శాలువాతో సన్మానించి వారికి చీరలు, జాకెట్లు ఇవ్వడం జరిగింది. అనంతరం 20క్గ్ ల భారీ కేక్ ను ముఖ్య అతిధులుగా విచ్చేసిన అతికారి దినేష్, కీర్తన, రెడ్డి రాణితో పాటు కొట్టే మణెమ్మ స్థానిక ప్రజలు జనసైనికులు మధ్య కేకు ను కట్ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గంలోని జనసేన నాయకురాలు రెడ్డి రాణి జనసేన నాయకులు గుగ్గిళ్ళ నాగర్జున, మస్తాన్ రాయల్, హేమంత్ రాయల్, గుగ్గిళ్ళ వెంకటేష్, అబ్బిగారి రాజగోపాల్, రామకృష్ణ, పసుపులేటి వెంకటేశ్, సోమిశెట్టి శంకర్, బాను, లేబాక్ వినయ్, పాటూర్ డాల నందలూరు మండల జనసైనికులు భారిగా విచ్చేశారు.