కూకట్పల్లి జనసేన ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు

కూకట్పల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో కే పి హెచ్ బి కాలని 5వ ఫేస్ పార్టీ కార్యాలయం వద్ద చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రేమ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త అని, ఉపాధ్యాయిని రచయిత్రి అని, ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, కుల మత భేదాలు లేకుండా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అని, ఆధునిక విద్య ద్వారా స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని సావిత్రిబాయి పూలే తన జీవితాంతం ప్రజల కోసమే బతికారని, పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందని, నూతన వ్యవస్థ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేశారని, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని, స్త్రీల అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని, స్త్రీలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని స్థాపించారని, మహిళా హక్కులే మానవ హక్కుల నీ తొలిసారిగా నినదించిన సావిత్రిబాయి పూలే సతిసహగమనాన్ని కి వ్యతిరేకంగా వితంతువు పునర్వివాహ కొరకు అసమాన బ్రాహ్మణిజం వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారని, గర్భవతులైన వారికి పురుడు పోసి వారి కళ్ళల్లో వెలుగు చూశారని, వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అని కొనియాడారు. ఈ కార్యక్రమములో కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.