పినరయి భారీ విజయం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి, సిపిఎం నేత పినరయి విజయన్‌ భారీ మెజార్టీతో గెలుపొందారు. ధర్మదం నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ఆయన 49,061 ఓట్ల ఆధిక్యతతో తన సమీప యుడిఎఫ్‌ అభ్యర్థి సి. రఘునాథన్‌పై గెలుపొందారు. 2016 ఎన్నికల్లో పినరయి విజయన్‌కు 36,905 ఓట్ల ఆధిక్యత మాత్రమే లభించింది. దాంతో పోలిస్తే తాజా ఎన్నికల్లో దాదాపు పది వేల ఓట్లు అదనంగా రావడం గమనార్హం.