కడప: అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు ఆదేశాల మేరకు కడప మెగా అభిమాని బ్రహ్మం నాయక్ ఆధ్వర్యంలో కడప 18వ డివిజన్ ఏ,ఎల్, కాలనీలో ప్రముఖ సినీ నటులు పద్మ విభూషణ్ మెగాస్టార్ డా. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల వారోత్సవాలలో భాగంగా రెండవ కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కడప జనసేన పార్టీ నాయకులు తుంగా రమణయ్య, కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పండ్రా రంజిత్ కుమార్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాలనీలోని అంగనవాడి విద్యాలయం, శ్రీరాముని దేవాలయం, అనేక నివాసాలు వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలదాసు నాగరాజు, తిరుమల శెట్టి సిద్ధార్థ్, తుంగా శ్రీను, తుంగా మధు, బాలు నాయక్, కుమార్ నాయక్, సుధీర్, మళ్లీ నాయక్, శివకుమార్, సురేష్, గోపాల్ నాయక్, సాయి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment