మున్సిపల్ కార్మికులు మరియు అంగన్వాడీల విజ్ఞప్తులు అరణ్య రోదనగానే మిగిలాయి: వాసగిరి మణికంఠ

గుంతకల్, గుంతకల్ పట్టణం మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీల సమస్యలపై వైకాపా సర్కార్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వారు చేస్తున్న నిరవధిక దీక్షలకు మద్దతుగా గుంతకల్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు బండి శేఖర్ అధ్యక్షతన సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన-టిడిపి సంప్రదింపుల సమన్వయ బాద్యులు వాసగిరి మణికంఠ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల అంటే ఎంతో ప్రేమ అభిమానాలు కురిపించి, వారి వృత్తి పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించిన సీఎం జగన్ గత నాలుగున్నర సంవత్సరంలో వారికి చేసింది ఏమైనా ఉందా అంటే? లేదనే సమాధానం వస్తుంది. ఆయన ఇచ్చిన అనేక హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలేదు ఇచ్చిన హామీలు నెరవేర్చవయ్యా మహాప్రభువు అంటున్న మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీల విజ్ఞప్తులు అరణ్య రోదనగానే మిగిలాయి. ప్రతిపక్ష నేత హోదాలో మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని నమ్మ పలికారు. అంగన్వాడీలకైతే తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను అని ప్రగల్బాలు పలికారు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు చేసే పనులు ఎవరూ చేయలేరు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తున్న కార్మికుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పిన జగన్ కనీసం వాళ్ళ కన్నీళ్లు కూడా తుడవ లేదని ఆయన ప్రశ్నించారు.

కోవిడ్ మృతుల కుటుంబాలకి తీరని అన్యాయం:-

కరోనా విపత్కర పరిస్థితుల్లో రహదారులపై రావడానికి ప్రజలు భయపడుతున్న సమయంలో పారిశుద్ధ కార్మికులు ఎంతో ధైర్యం చేసి వీధులను శుభ్రం చేశారు ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 50 మందికి పైగా కార్మికులు కరోనాతో మృతి చెందారు. మృతుల కుటుంబాలకు 50 లక్షలు పరిహారం ఇస్తామన్న కేంద్ర హామీ నెరవేరలేదు కేంద్రానికి ఎందుకు సంబంధించిన సమాచారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఆఖరుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు ఎలాంటి సహాయం చేయలేదు. వైకాపా సర్కార్ ప్రతి ఒక్క కార్మికుడికి తీరని అన్యాయం చేసిందని రాబోయే రోజుల్లో వారే ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతారని, రానున్న రోజుల్లో వీరందరి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబుల నాయకత్వంలో ఏర్పాటు చేయబోయే జనసేన-టిడిపి సంకీర్ణ ప్రభుత్వం ద్వారా వీళ్లందరి న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యక్రమాల నిర్మాణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, ఎస్.కృష్ణ సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, విజయ్ కుమార్, పామయ్య, ఆటో రామకృష్ణ, బార్మశాల శేఖర్, మంజునాథ్, కత్తులగేరు అంజి, అమర్నాథ్, రమేష్ రాజ్, కొనకొండ్ల శివ, ఆటో కృష్ణ, రామకృష్ణ, శివకుమార్, ఆటో బాషా, దాదు, అనిల్, వెంకీ, సత్తి తదితరులు పాల్గొన్నారు.