దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, నన్ను కలుసుకోవడానికీ ప్రయత్నించకండి: హరీష్ రావు

తెలంగాణా మంత్రి హరీష్ రావు తనకు కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే స్పందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. మొన్న రాత్రి ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన కోలుకోవాలి అని పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. దీనిపై హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అంటూ హరీష్ రావు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. మీ ప్రేమే నాకు అసలైన వైధ్యం అన్నారు ఆయన. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, నన్ను కలుసుకోవడానికీ ప్రయత్నించకండని ఆయన సూచించారు. నా హెల్త్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా మీతో షేర్ చేసుకుంటానని హరీష్ ట్వీట్ లో తెలిపారు.