ప్రగతి భవన్ వద్ద పోలీసుల మోహరింపు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసుల దాడి కి నిరసనగా నేడు చలో ప్రగతి భవన్ కు ఎబివిపి, బిజేవైఎం పిలుపు నిచ్చిన నేపధ్యంలో వందల సంఖ్యలో ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులు భారీగా మోహరించారు. అలానే తెలంగాణా భవన్ వద్ద కూడా పోలీసులు మొహరించారు. ఇక మరో పక్క బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో స్వీయ నిర్బంధంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష కొనసాగుతోంది.

సిద్ధిపేట సీపీని సస్పెండ్ చేయాలంటూ సంజయ్ దీక్షకు దిగారు. నిన్న రాత్రి 9.30 గంటలకు పోలీసుల తీరుకు నిరసనగా దీక్షకు సంజయ్ దిగారు. సిద్దిపేట ఘటనపై నిన్న అమిత్ షా ఆరా తీశారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనలకు రెడీ అవుతున్నాయి పార్టీ శ్రేణులు. సంజయ్ దీక్షకు సంఘీభావం తెలపడానికి డి కె అరుణ, ఎంపీ సాయం బాబు రావులు వెళ్లనున్నారు. సంజయ్ దీక్ష పై ఆరా తీస్తున్న పోలీసులు దీక్ష కేంద్రం వద్ద నిఘా ఏర్పాటు చేశారు.