బీజేపీ మహిళా నేత కుష్బూ అరెస్ట్‌

ప్రముఖనటి బీజేపీ నేత ఖుష్బూను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ మహిళలను కించపరిచే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ తిరుమాళవన్ అయోధ్య రామాలయం దేశంలోని హిందూ దేవాలయలపై వివాదాస్పదంగా మాట్లాడారు. తిరుమల్వన్‌ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు బయల్దేరిన సినీ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ‘మహిళలను వేశ్యలుగా ఉండేందుకు దేవుడు వారిని పుట్టించారు’ అంటూ తిరుమల్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దానిపై వివాదం చెలరేగుతున్న తరుణంలో కుష్ఫు ఆందోళన చేశారు.  ఈ నేపథ్యంలో ఖుష్బూని ఈసీఆర్ రోడ్డులో పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈరోడ్ జిల్లాలోని గౌండంబాడి ప్రాంతంలో సోమవారం తిరుమావళవన్ కారును ముట్టడించేందుకు బీజేపీ వర్గీయులు ప్రయత్నించగా.. వీసీకే నాయకులు వారికి అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఒకరిపై మరికొరు పాదరక్షలను విసురుకున్నారు. వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు 15 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఖుష్బూ ఎంట్రీతో తమిళనాడులోని భారతీయ జనతాపార్టీ క్రియాశీలంగా మారింది.