పోట్టెంపాడు నక్కల కాలవ వంతెన పరిశీలన

*పోట్టెంపాడు నక్కల కాలవపై శిథిలావస్థలో ఉన్న వంతెనను పరిశీలించిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి నియోజకవర్గం: ముత్తుకూరు మండలం, పొట్టెంపాడు నుంచి బ్రహ్మదేవం మీదుగా నెల్లూరుకి వెళ్లే మార్గంలో నక్కల కాల్వ పై అస్తవ్యస్తంగా ఉన్న వంతెనను పరిశీలించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లు వైసిపి పాలనలో అభివృద్ధికి నోచుకోని సర్వేపల్లి రిజర్వాయర్ అస్తవ్యస్తంగా ఉన్న నక్కల కాల్వపై పొట్టింపాడు వద్ద వంతెన గత వైసిపి పాలనలో నక్కల కాలవ మరమ్మతులకి నోచుకోని పరిస్థితి, కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావల్ ని అమ్ముకోవడం జరిగింది. అస్తవ్యస్తంగా ఉన్న వంతెన నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన కూడా లేకపోవడం నిజంగా సిగ్గుతో కూడినటువంటి విషయం. ఆదివారం కూటమిలో భాగంగా ఈ వంతెన పరిశీలించాం, అదేవిధంగా ఈ నక్కల కాలవలో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిపోయింది. వర్షాకాలంలో సర్వేపల్లి చెరువు నుండి కాల్జు ద్వారా వచ్చే నీళ్లు ఈ కట్ట పొల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోకి వెళ్లిపోయే పరిస్థితి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఈ యొక్క గుర్రపు డెక్క తొలగిస్తే, మా గ్రామాల్లోకి యలవ నీళ్ళు రాకుండా ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్థానిక కూటమి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి, ఈ ఆకును తొలగించే దానికి గట్టిగా ప్రయత్నం చేయడంతో పాటు ఈ వంతెన నిర్మాణం కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగే విధంగా చర్యలు చేపడతామని చెప్పి మనస్పూర్తిగా తెలియజేస్తా ఉన్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్ సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం ముత్తుకూరు మండల నాయకులు, రహీం, బోలా అశోక్, గౌతం, శీను, అక్బర్, వినోద్, పట్టాభి, వినయ్, లాలు, బన్నీ, వెంకటేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment