ట్రంప్ కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ లీజియన్ ఆఫ్ మెరిట్’ ను ప్రకటించడం పట్ల ప్రధాని మోదీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారత-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పటిష్ట పరచేందుకు రెండు దేశాల ప్రజలు చేస్తున్న కృషికి ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నా అని ఆయన ట్వీట్ చేశారు. ఇది -యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఏకాభిప్రాయానికి వఛ్చినందుకు దీన్ని క్రెడిట్ గా పరిగణిస్తున్నా అన్నారు. ఈ అవార్డు తనకెంతో సంతోషం కలిగించిందని, 21 వ శతాబ్దం మనకెన్నో సవాళ్ళను విసిరిందని, అయితే మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం ప్రపంచ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే మన లక్ష్యం కావాలన్నారు. ఇండియాలోని 130 కోట్ల మంది ప్రజల తరఫున చెబుతున్నా.. మన ఉభయ దేశాల సంబంధాల పటిష్ఠతకు మా ప్రభుత్వం మరింతగా కృషి చేస్తుంది అని మోదీ ట్వీట్ చేశారు.