ప్రధాని మోడీ అమెరికా పర్యటన.. ఐదు కంపెనీల సీఈవోలతో భేటీ

 అమెరికాకు చెందిన ఐదు దిగ్గజ కంపెనీల అధినేతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మొదట క్వాల్‌కామ్‌ సీఈఓ క్రిస్టియానో అమోన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత భారత సంతతికి చెందిన అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌తో పాటు ఫస్ట్‌ సోలార్‌ సీఈఓ మార్క్‌ విడ్మార్, బ్లాక్‌స్టోన్‌, జనరల్‌ అటామిక్స్‌ సంస్థల సీఈఓలతోనూ భేటీ అయ్యారు. డిజిటల్‌ ఇండియా, 5G, రక్షణ, పునరుత్పాధక ఇంధనం, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత్ మంచి అవకాశాలను అందిస్తున్నదని ప్రధాని మోడీ వారికి తెలిపారు.

భారత ప్రధానితో నిర్మాణాత్మక చర్చలు జరిపినట్టు క్వాల్‌కామ్‌ సీఈఓ క్రిస్టియానో ప్రకటించారు. భారత్‌తో టెక్నాలజీని పంచుకోవడం గర్వంగా ఉందని.. త్వరలోనే భారత్‌లో 5G సేవల విస్తరణ గురించి ప్రధానితో చర్చించినట్టు ప్రకటించారాయన. భారత్‌లో ఉండే అవకాశాలను సరిగా అందిపుచ్చుకునేందుకు కృషి చేస్తామని క్వాల్‌కమ్ సీఈఓ తెలిపారు.