సీజనల్ వ్యాధులనుండి,దోమల బెడద నుండి ప్రజలను కాపాడండి: లోపింటి కళ్యాణ్

విజయనగరం: వర్షాకాలం కావటంతో విరివిగా వర్షాలు పడటంతో 27వ డివిజన్, జొన్నగుడ్డి ప్రాంతపు ప్రజలంతా మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం వలన సీజనల్ వ్యాధుల భారినపడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని 27వ డివిజన్ జనసేన కార్పొరేట్ అభ్యర్థి, జనసేన యువనాయకుడు లోపింటి కళ్యాణ్ అన్నారు.

ఈ సందర్బంగా దీనిపై మున్సిపల్ అసిస్టెంట్ కమీషనర్ పి.వి.వి.డి ప్రసాదరావు కు శుక్రవారం ఉదయం వినతిపత్రాన్ని జనసేన యువనాయకుడు కళ్యాణ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ 27వ డివిజన్, జొన్నగుడ్డి ప్రాంతం ప్రస్తుతం వర్షాలు విరివిగా పడుతుండంతో స్థానిక ప్రజలంతా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారని, కాలువల సరిగ్గా లేకపోవడంతో, గత కొన్నాళ్ళుగా మున్సిపల్ సిబ్బంది కాలువలు శుభ్రం చెయ్యట్లేదని, బ్లీచింగ్ అస్సలు వేయట్లేదని
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వలన మా ప్రాంతపు ప్రజలంతా ఎక్కవగా దోమల బెడదతో జ్వరాలు, వివిధ అనారోగ్యంతో బాధపడుతున్నారని అన్నారు.

జనసేన వినతిని తమరు పరిశీలించి, మా27వ డివిజన్ ప్రాంతపు ప్రజల ఇబ్బందులను గమనించి, తక్షణమే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిచే కాలువలు క్లినింగ్, చేయించి, బ్లీచింగ్ వేసి, ముఖ్యంగా దోమలు పోయందుకు పొగ మందును వేసి, మున్సిపల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వారిచే వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించాలని జనసేన పార్టీ తరుపున కోరుకుంటున్నామని తెలిపారు.

ఈ వినతిని తక్షణమే పరిగణలోకి తీసుకొని 27వ డివిజన్ ప్రాంతపు ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తమరు సహృదయంతో సహకరించాలని విన్నవించుకుంటామని మున్సిపల్ అసిస్టెంట్ కమీషనర్ ను కోరారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, పిడుగు సతీష్, రొయ్యి రాజు, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, దువ్విరాము, బూడి వాసు పాల్గొన్నారు.