సర్వేపల్లి జనసేన ఆధ్వర్యంలో నిరసన

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లి నుండి గొలగమూడి మీదుగా నెల్లూరుకి వెళ్లేటువంటి రోడ్డు అస్తవ్యస్తంగా గుంతలమయం అయ్యి ఉంది. ఆ రోడ్డుపై గుంటలను పుడ్చాలని ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి వెంకటాచలం గేటు రిపేర్ అవడంతో సర్వేపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి 30 గ్రామాల ప్రజలు నెల్లూరుకు వెళ్లాలంటే తిక్కవరపాడు గొట్లపాలెం మీదుగా గొలగమూడిని కలుపుకుంటూ వెళ్లేటువంటి రోడ్డు మార్గంగా వెళ్లేటువంటి పరిస్థితి అయితే గొట్లపాలెం దాటిన తర్వాత ఐదు కిలోమీటర్ల వరకు రోడ్డు అస్తవ్యస్తంగా గొట్టం అయి ఉంటే ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ గుంటలమయం రోడ్లో వెళ్లేటువంటి స్కూటర్లు కావచ్చు, ఆటోలు కావచ్చు ,బస్సు ప్రయాణికులు అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డుపై గుంటలను పూడ్చమని ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి నిరసన రూపంలో తెలియజేయడం జరిగింది. అయినా గాని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రాధాన్యం వహిస్తున్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేశారని చెప్తున్నారు కానీ ఐదు కిలోమీటర్ల రోడ్డుని పూర్తిస్థాయిలో నిర్మించినటువంటి పరిస్థితి దయచేసి ఇకనైనా ఈ రోడ్డుపై ఉన్న గుంటలను గూర్చి 5 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం చేస్తారా లేదంటే జనసేన పార్టీ చందాల రూపంలో కలెక్ట్ చేసి ఈ గుంటలను పూడ్చుకోమంటారా అనేటువంటి విషయాన్ని మంత్రి గారికి వదిలేస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఓట్లేసి గెలిపిస్తే సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేశానని చెప్పి చెప్పకుండా అటువంటి కల్లబొల్లి మంత్రి సర్వేపల్లి నియోజకవర్గం ఎక్కడా లేనటువంటి పరిస్థితి పాపం ఆయనేమో మళ్లీ మూడోసారి కూడా నేనే గెలుస్తానని చెప్పుకుంటున్నారు. కానీ రేపు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ కూడా లేకుండా ఇంటికి వెళ్ళడానికి తట్ట బుట్ట సర్దుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, ఖాజా, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు షేక్ రహీం, చిన్న, శ్రీహరి, రహమాన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.