జనసేన పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఫలితం దొరుకుతుంది: గురుదత్

  • క్రియాశీలక వాలంటీర్స్ కృషి, రేపటి ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం రూపంలో కనిపిస్తుంది

రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ అధ్యక్షతన జనసేన పార్టీ మూడో విడత క్రియశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గంలో క్రియాశీలక వాలంటీర్లను వారి శ్రమ, పట్టుదల, పార్టీపై ఉన్న ప్రేమతో అత్యధిక సభ్యత్వాలు చేసిన వారికి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక వాలంటీర్లను సన్మానించడం జరిగింది. సీతానగరం మండలానికి చెందిన కాత సత్యనారాయణ, కలవచర్లకు చెందిన చల్లా దుర్గా ప్రసాద్ శ్రీరంగపట్నానికి చెందిన తన్నీరు తాతాజీ మరియు వంద పైగా సభ్యత్వాలు చేసిన కామిశెట్టి హిమశ్రీ, కందికట్ల అరుణ, ముక్క రాంబాబు, మన్య నాగ సుబ్రహ్మణ్యం, రాచపోతుల సురేష్ లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐటి కో- ఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, సీతానగరం మండల జనసేన కో-కన్వీనర్ తణుకు రమేష్ బాబు, కోరుకొండ మండలం ప్రధాన కార్యదర్శి విరపురాజు పోసిబాబు, కోరుకొండ మండల జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, చదువు ముత్తేశ్వరరావు, దేవన కృష్ణ, కోటి బాబు, మన్య శ్రీను, అడపా అంజి, తోట శివ, ఆకుల ఆదిత్య,పల్లా హేమంత్, దుర్గా ప్రసాద్, వంశీ, మండపాక మురళి, గొల్లకోటి కృష్ణ, కోరుకొండ మండలం ప్రధాన కార్యదర్శి కోలా జాన్ ప్రసాద్, పినిశెట్టి ప్రసాద్, హరిచంద్రప్రసాద్, రాజు, అడ్డాల లీలా భగవాన్, కొచ్చర్ల రాజు, సోడాసాని శివాజీ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.