ఓం శక్తి అమ్మవారి దీక్షకులకు భోజన సదుపాయం

తిరుపతి: పట్టణం బైరాగిపట్టెడ భగత్ సింగ్ కాలనీలో ఉన్న అమ్మ వారి ఆలయంలో మహిళలు ఓం శక్తి అమ్మవారి దీక్ష తీసుకోవడంతో గురువారం తమిళనాడులో గల మేల్ మరవత్తూర్ దేవస్థానంకి మొక్కులు చెల్లించుకోవడానికి ప్రయాణం ఏర్పాటు చేసుకోవడంతో సీనియర్ నాయకురాలు సుబ్బలక్ష్మమ్మ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ దీక్షలో ఉన్న వారికి భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఆనంద్, బాటసారి, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, కార్యదర్శులు దినేష్ జైన్, చరణ్ రాయల్, లోకేష్, కిరణ్ కుమార్, రవి, బాలాజీ, హేమంత్, సాయి, పురుషోత్తం, పురుషోత్తం రాయల్, మనోజ్ కుమార్, గౌస్ బాషా, అర్బన్ అధ్యక్షులు సాయి, జనసైనికులు మోహిత్, బాలాజీ, రవి తదితర నాయకులు పాల్గొన్నారు.