పోణంగి వైఎస్సార్ కాలనీలో ప్రజా సంకల్ప యాత్ర

  • కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో రెడ్డి అప్పల నాయుడు ఆదేశాల మేరకు పాల్గొన్న ఏలూరు నియోజకవర్గ జనసేన నాయకులు

ఏలూరు: విధ్వంసకారులను ఎన్నుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండదని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడిందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి పేర్కొన్నారు.. ఏలూరులో ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి నిర్వహిస్తోన్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది.. ఇప్పటికే రెండుసార్లు ప్రజలను కలుసుకున్న బడేటి చంటి మూడవసారి వారి వద్దకు వెళ్ళి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి డివిజన్ ప్రజలకు వివరిస్తున్నారు.. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి భివృద్ధి జరగాలన్నా, పిల్లల భవిష్యత్ బావుండాలన్నా కూటమికి ఓటు వేయాలని కోరుతున్నారు. ఏలూరు 13వ డివిజన్ వైఎస్సార్ కాలనీలో శుక్ర వారం సాయంత్రం నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు.. ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజలను కలుసుకున్నారు.. కూటమికి అండగా నిలవాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశి నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, వీరంకిపండు, బోండా రాము నాయుడు, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, రాజు నాయుడు, పైడి లక్ష్మణరావు, జనసేన రవి, నూకల సాయిప్రసాద్, నిమ్మల శ్రీనివాసు, బొత్స మధు, ఎమ్.డి.ప్రసాద్, మేకా సాయి, వంశీ, అరవింద్, మల్లపురెడ్డి సోంబాబు, నాని, వీరమహిళలు కుర్మా సరళ, తుమ్మపాల ఉమా దుర్గ, ప్రమీల రాణి, గాయత్రి, దుర్గా బి బి తదితరులు పాల్గొన్నారు.