మంత్రి నాదెండ్లను కలిసిన పివిఎస్ఎన్ రాజు

*పార్టీ సేవలపై ప్రశంసలు

విశాఖ పర్యటనలో ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని చోడవరం నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తున్న తీరును, అలాగే పార్టీ నేతృత్వాన్ని బలోపేతం చేస్తున్న విధానాన్ని నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. కూటమి స్ఫూర్తిని కొనసాగిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి చూపిస్తున్న కృషిని అభినందించారు. కూటమి స్ఫూర్తిని కొనసాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం కోసం రాజు ప్రభావవంతంగా పనిచేస్తున్నారంటూ ఆయన ప్రశంసలు గుప్పించారు.

Share this content:

Post Comment