పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మహిళలకు రాఖీ కానుకలు

కళ్యాణదుర్గం, రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో 1500 మంది వితంతు మహిళలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కళ్యాణదుర్గం జనసేన ఇన్‌చార్జ్ బాల్యం రాజేష్ స్థానిక మహిళలకు చీరలు బహుకరించారు. సోదర భావం, ఆత్మీయతను పంచిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాల్యం రాజేష్, జాకీర్, అనిల్, అలాగే జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. బాల్యం రాజేష్ అక్కచెల్లెళ్లకు, ఆడపడుచులకు, ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Share this content:

Post Comment