నెల్లూరులో రక్షాబంధన్ సంబరాలు

నెల్లూరు, రాఖీ పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా, గోమతినగర్‌లోని జనసేన కార్యాలయంలో వీరమహిళలు ఘనంగా రక్షాబంధన్ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ నేర్పారని, అదే ఆత్మీయతతో పార్టీ పనిచేస్తోందని తెలిపారు. గత ఏడు సంవత్సరాలుగా పలు ఆడబిడ్డలకు సహాయం అందించామని, లక్ష్యం పవన్ కళ్యాణ్‌ను అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్యాలయం ఇన్‌చార్జ్ జమీర్, సీనియర్ నాయకులు రవికుమార్, వీర మహిళలు కృష్ణవేణి, శాంతి కల, రాధమ్మ, కస్తూరి, వాణి, నందిని, వరలక్ష్మి, లతా, వెంకటసుబ్బమ్మ, జ్యోతి, ప్రమీల, ఉషారాణి, కామాక్షి, ప్రసన్న, చంద్రశేఖర్ రెడ్డి, మనోజ్, షఫీ, వర్షన్, కేశవ, మౌనేష్, హర్ష తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment