రక్షా బంధన్ కానుకగా చీరల పంపిణీ

రావికమతం, రాఖీ పౌర్ణమి సందర్భంగా రావికమతం మండల కేంద్రంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, మండల పార్టీ అధ్యక్షుడు మైచర్ల నాయుడు ఆధ్వర్యంలో వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల పట్ల జనసేన పార్టీ ఎల్లప్పుడూ గౌరవ భావంతో ఉంటుందని, వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మహిళలు కూడా పార్టీ నాయకుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బంటు రామునాయుడు, వీర మహిళ అధ్యక్షురాలు, స్కూల్ కమిటీ చైర్మన్ దొడ్డి పోలమ్మ, మండల ప్రధాన కార్యదర్శి లొట్ల శివ, కార్యదర్శులు ముక్కా రామసూరి, కోన రమణ, దాసరి చిన్నబ్బాయి, రావికమతం గ్రామ అధ్యక్షులు యతీరాజ్యం నాగ భూషణం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-08-09-at-4.09.34-PM-1024x456 రక్షా బంధన్ కానుకగా చీరల పంపిణీ

Share this content:

Post Comment