100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

*భారతీయ జనతా పార్టీ, జనసేన ఆధ్వర్యంలో ఘనంగా ముందస్తు పంద్రాగస్టు వేడుకలు

బెళుగుప్ప మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ, జనసేన ఆధ్వర్యంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా భారత్ మాతాకీ జై, జై జవాన్-జై కిసాన్, హర్ ఘర్ తిరంగా అంటూ నినాదిస్తూ 100 అడుగుల జాతీయ జెండాతో బెళుగుప్ప మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా మండల తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించి అధికారులు, నాయకులు మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఒక్కరూ వారి మనసుల్లో జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని తదుపరి ప్రతి ఒక్కరూ ఈ పంద్రాగస్టు వేడుకలు, స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ త్రివర్ణ పథకాన్ని వారు వాళ్ళ ఇంటిపై ఎగరవేయాలని బిజెపి, జనసేన నేతలతో పాటు తాహసిల్దార్ కార్యాలయ సిబ్బంది మరియు మండల అధికారులు ప్రజలకు తెలియజేశారు. అనంతరం అందరూ కలిసి భారత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో చివరిగా జాతీయగీతం ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు. తదుపరి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మహిళ మోర్చా జిల్లా నాయకురాలు దగ్గుబాటి సౌభాగ్య, జనసేన మండల అధ్యక్షులు కాశంశెట్టి సుధీర్, భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షులు వన్నూరుస్వామి, బెలుగుప్ప మండల తహసీల్దార్ అనిల్ కుమార్, ఎం.పి.డి.ఓ లక్ష్మీనారాయణ, బెలుగుప్ప పంచాయతీ కార్యదర్శి శివరంజని, బెలుగుప్ప మండల ఏ.ఎస్సై. రామదాస్, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, భారతీయ జనతా పార్టీ నాయకులు సుంకన్న, మనోహర్, కోనంకి ఎర్రిస్వామి, హరినాథ్ గుప్తా, రామలింగ, సుబ్రహ్మణ్యం, ఎస్.నారాయణ, ఎస్.ప్రదీప్ జనసైనికులు కమ్మర శేఖర్, తిప్పేస్వామి, రవికుమార్ నాయక్, గణేష్, అభి, శ్రీ శ్రీనివాస విద్యానికేతన్, సన్ రైజర్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment