రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్ గా రామాచార్యులు నియామకం

రాజ్యసభకు నూతన సెక్రటరీ జనరల్ గా డాక్టర్ పీపీకే రామాచార్యులు నియమితులయ్యారు. రామాచార్యులు నియామకాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. రామాచార్యులు ప్రస్తుతం రాజ్యసభ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2018 నుంచి ఆయన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. గత మూడు దశాబ్దాలుగా వివిధ పార్లమెంటరీ కమిటీలను పర్యవేక్షించారు. ఎంపీలాడ్స్ కమిటీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిటీ, హోంశాఖ కమిటీల కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించారు.