ఏపిజే అబ్దుల్ కలాం కు ఘననివాళులర్పించిన రాయచోటి జనసేన

రాయచోటి జనసేనపార్టీ కార్యాలయంలో డా. ఏపిజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జనసైనికుల ఆధ్వర్యంలో ఘణనివాళులు అర్పించిన ఇంచార్జ్ షైక్ హసన్ భాష. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మాజీ రాష్ట్రపతి, దేశానికి శాస్త్ర, సాంకేతికపరమైన ఎన్నో విజయాలను అందించిన ఏపీజే అబ్దుల్‌కలాం మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన జీవితం అందించిన స్ఫూర్తి భవిష్యత్ తరాల విజయాలకు వెలుగుబాటగా నిలుస్తుందని కలాం వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు కోలా నవీన్, పఠాన్,పరమేష్, హిమమ్, షబ్బీర్, జనసేన పార్టీ నాయకులు రామశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.