తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ల నియామకం

మంగళగిరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఐటి చైర్మన్ మిరియాల శ్రీనివాస్ జనసేన పార్టీ ఐటి విభాగం తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గాల ఐటి కోఆర్డినేటర్లను నియమించడం జరిగింది. నియోజకవర్గ పరిధిలో జరిగే పార్టీ సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన ఐటి సేవలను ఈ కోఆర్డినేటర్లు సమన్వయం చేస్తారు. ఈ విభాగానికి జిల్లా ఐటి కోఆర్డినేటరుగా గాలిదేవర తమ్మేష్ ను నియమించిన సంగతి తెలిసిందే.