ఇఫ్తార్ విందులో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు..

ఏలూరు నియోజకవర్గంలోని 45వ డివిజన్ లక్ష్మీవారపుపేట ఏఆర్డిజీకేస్కూల్ వద్ద ఉన్న మొహమ్మదియా మసీదులో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదర, సోదరీమణులకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.. అనంతరం మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ.. పవిత్రమైన రంజాన్ నెలలో కఠోరమైన దీక్షలు చేస్తున్న ముస్లిం సోదర, సోదరీమణులకు ఈవిధంగా ఫ్రూట్స్ పంపిణీ చేయడం మాకెంతో ఆనందం కలిగించే విధంగా ఉన్నదని, ఆ అల్లా దీవెనలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు ఏలూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు.. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, నాయకులు బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, వేముల బాలు, నిమ్మల శ్రీనివాసరావు, బలరాం, స్థానిక 45 వ డివిజన్ ఇంచార్జీ పసుపులేటి దినేష్, ముస్లిం సోదరులు షేక్ మస్తాన్, షేక్ ఈసూబ్, షేక్ నాగూర్, షేక్ అబ్దుల్, పఠాన్ రసూల్, షేక్ అల్లాబక్షు, షేక్ కరిముల్లా, షేక్ పండు, పఠాన్ షాకీర్, ఈదుపల్లి జయకుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.