క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోండి, మీ కుటుంబానికి భరోసాని కల్పించండి.. జనసేన

తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు మంగళవారం జనసేన రాష్ట్ర, జిల్లా, పట్టణ, వార్డు కమిటీలతో జిల్లా అధ్యక్షులు పీఏసీ సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడో విడత ఫిబ్రవరి 10వ తేదీన మొదలై 28వ తేదీ వరకు జరగనున్నది, కావున జనశ్రేణులు, జనసేన పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీలకన సభ్యత్వం నమోదు చేసుకొని మీ కుటుంబానికి భరోసాని కల్పించండి, ఈ సభ్యత్వం నమోదు చేసుకోవడం ద్వారా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగినచో 50 వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా, క్రియాశీలక సభ్యునికి జరగరానిది ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకు మన కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఏ పార్టీలో లేని విధంగా మనకోసం ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారని కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రేపు రాబోయే మన ప్రజా ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు తావు లేకుండా అవినీతి నిర్మూలనే జనసేన పార్టీ యొక్క ద్యేయయమని, సామాన్య ప్రజలకు ఏ కష్టమొచ్చిన మొట్టమొదట జనసేననే గుర్తుకు వస్తుందని, ప్రతి ఒక్కరు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఎక్కడికి అక్కడ కలిసికట్టుగా పోరాడాలని, పవన్ కళ్యాణ్ యొక్క అభ్యుదయ భావాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని వారు కమిటీ సభ్యులకు దిశా నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ, వార్డు కమిటీ సభ్యులు, జనసేన ముఖ్య నాయకులు, వీరమహిళలు, జనసైనికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.