ఎపిలో ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఐసెట్‌కు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. జనవరి 25 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు.. కాగా జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.. జనవరి 31 సాయంత్రం 6 గంటల తర్వాత వెబ్‌ అప్షన్లు మార్చేందుకు ఎలాంటి వీలు ఉండదు.. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 2వతేదీ సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఫీజు, జనరల్‌, బిసి అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600గా నిర్ణయించారు.

ఇందుకు సంబంధించి హెల్ప్‌నెంబర్లు:

810 687 6345,

810 657 5234,

799 668 1678. ను సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.