ముత్తానగర్ లో మా ప్రాంతం.. మన సచివాలయం కార్యక్రమం

  • అస్త వ్యస్తంగా మారిన గృహ నిర్మాణ పథకం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముత్తానగర్ వాసులు..

కాకినాడ సిటీ: అస్త వ్యస్తంగా మారిన గృహ నిర్మాణ పథకం తీరుపై ముత్తా నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేఆరు.. కాకినాడ గృహనిర్మాణ పథకం అమలు నిర్వహణలో పేదల జీవితాలతో ఆడుకుంటూ పబ్బం గడుపుతూ వైకాపా ప్రభుత్వం మోసం చేస్తుందని జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులు, కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. ఆదివారం ముత్తానగర్ లో మా ప్రాంతం మన సచివాలయం కార్యక్రమంలో పాల్గొని అక్కడి. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి మత్యకార మహిళలు మాట్లాడుతూ ఇళ్ళు లేని పేదలకి ఇళ్ళు స్థలాలు అని చెప్పి ఒక్క కాగితం ముఖాన పాడేసారని, స్ధలం ఎక్కడుందో చెప్పాలని ఎమ్మెల్యేను నిలదీసి అడిగితే రకరకాల ఉర్ల పేరు చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో పారి శుద్యం సరిగా లేక పోయినా చెత్త పన్ను చెల్లింపులు ముక్కు పిండి మరీ వాలంటీర్లు కట్టించుకోవడం ఇదేం దారుణం అన్నారు. వేలల్లో కుళాయి పన్నులు వస్తున్నా అడిగే నాథుడే కరువయ్యారని గగ్గోలు పెట్టారు.