ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయమే ముఖ్యం: దారం అనిత

మదనపల్లె, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వారి పార్టీ మానిఫెస్టో లో మద్యం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, మద్యాన్ని దశల వారీగా నిషేదిద్దాం అని నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తరువాత అదే పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్నారు. అధికార పార్టీ ప్రజల ప్రాణాలు ఏమైపోయినా పర్లేదు గానీ ప్రభుత్వానికి మాత్రం ఆదాయం వచ్చి తీరాలి అని అనుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంటే నియంత్రించాల్సిన ప్రభుత్వం మద్యం అమ్మకాలు పెంచి ఆ ఆదాయం మీద అప్పులు తేవాలని చూడడం బాధాకరం. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ఏపీ బెవరేజ్స్ కార్పొరేషన్ ఆదాయం చూపించి రూ.8,300 కోట్ల అప్పులు తీసుకొని వచ్చింది. ఇప్పుడు మద్యం మీద పెరిగిన ఆదాయాన్ని చూపించి రూ.25 వేల కోట్ల అప్పులు తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది. ప్రజల ఆరోగ్యం కంటే కూడా ఆదాయం ముఖ్యం అనుకోవడం కచ్చితంగా పౌర సమాజం ఖండించాల్సిన అంశం అని అన్నారు.