టిటిడికి రూ.10 కోట్ల విరాళం

చిత్తూరు (తిరుమల) : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కు ఢిల్లీకి చెందిన సంజయ్‌ పస్సి, శాలిని పస్సి అనే భక్తులు శుక్రవారం రూ.10 కోట్ల విరాళం అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ మేరకు డిడిలను అదనపు ఇఒ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. వారిచ్చిన విరాళంలో రూ.9 కోట్లు శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌ (ఎస్‌విబిసి) ట్రస్ట్‌కు, రూ.కోటి సర్వశ్రేయస్సు ట్రస్ట్‌కు అందించారు.