శింగనమలలో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను పరామర్శించిన సాకే మురళీకృష్ణ

శింగనమల: మండలకేంద్రములోని కస్తూరిభాయి స్కూలునందు పుడ్ పాయిజన్ అయిన్న విద్యార్థులను అనంతపురం పావని హాస్పిటల్ నందు జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ పరామర్శించి మాట్లాడూతూ విద్యార్థులు చాలా ఇబ్బందిపడుతున్నారని, శుక్రవారం సాయంత్రము 4గంటల నుండి
విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలుతో ఇబ్బంది పడుతుంటే దాదాపుగా 8గంటలకు విద్యార్థులను స్కూలు హెచ్ ఓ హస్పిటల్ లో జాయిన్ చేయడము జరిగింది. ఇంతనిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని, పుడ్ పాయిజన్ కు కారణమైన వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేయడమైనది.