సరూర్‌నగర్‌ ప్రచారంలో సబితారెడ్డి

బల్దియాపీఠం ప్రచారంలో కారు దూసుకెళ్తుంది.  ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డికి మద్దతుగా ఎస్‌వీఆర్‌ఎస్‌ బృందావన్‌ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ తీగల అనితారెడ్డి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మతం, కులం, ప్రాంతీయ భేదం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉందని, కార్పొరేటర్లుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొవచ్చని తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్‌ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న సీఎం కేసీఆర్‌ విజన్‌తో ముందుకెళ్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ అరేండ్లలో చేసిన అభివృద్ధిని గ్రహించిన ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్‌, డివిజన్‌ అధ్యక్షుడు ఆకుల అరవింద్‌, నియోజకవర్గ యూత్‌వింగ్‌ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, నాయకులు కొండగిరిగౌడ్‌, సుదర్శన్‌, రాఘవేంద్రగుప్త, జంగారెడ్డి, కేశవరెడ్డి, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.