త్యాగం… సత్యం విలువను చాటే బక్రీద్

ఓ మహోన్నత త్యాగాన్ని స్మరించుకొంటూ నిర్వహించుకొనే పర్వదినం బక్రీద్. ఈ పండుగ జీవిత సత్యాలను తెలియచేస్తుంది. మనిషి తన జీవన గమనంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని… వాటిని తట్టుకొంటూ సత్యం కోసం స్థిరంగా నిలబడి అందుకోసం అవసరమైతే త్యాగానికి సిద్ధపడితేనే సత్ఫలితాలు అందుతాయని బక్రీద్ పర్వదినం నేపథ్యం ద్వారా తెలుస్తుంది. ఇస్లాంను విశ్వసించే ప్రతి ఒక్కరికీ నా తరఫున, జనసేన పక్షాన బక్రీద్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.