పేద ప్రజలకేనా అభయారణ్య చట్టాలు..!

దెందులూరు నియోజకవర్గంలో కోమటిలంక గ్రామం నుండి బయటకి వచ్చే మార్గం లేక కొల్లేరులో పడవ ప్రయాణంలో వస్తున్నారు ఇక్కడ ఉన్న వై.ఎస్.ఆర్ పార్టీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గెలిచిన వెంటనే బ్రిడ్జ్ వేపిస్తాను అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు దాని ఊసేలేదు అక్కడి ప్రజలే తాత్కాలికంగా రోడ్ వేసుకున్నారు ఇది వర్షాకాలం వస్తే మళ్ళీ వీళ్ళకి మార్గం ఉండదు ఇక్కడున్న ఫారెస్ట్ అధికారులు కలెక్టర్ ఇది అభయారణ్య చట్టంలో ఉంది అని చెప్పి పర్మిషన్స్ ఇవ్వట్లేదు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కలెక్టర్ ఫారెస్ట్ అధికారులకి ఈ పేద ప్రజలకి బ్రిడ్జ్ వేయటానికి జీవోలు చట్టాలు అడ్డొస్తున్నాయి కొల్లేరు గ్రామాలలో అక్రమ చెరువులు తవ్వకాలకు మాత్రం పర్మిషన్లు ఇస్తున్నారు వాళ్లు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్లకి పర్మిషన్లు ఇస్తున్నారు ఈ ప్రజలు డబ్బులు ఇవ్వలేరు కాబట్టి వీళ్ల వల్ల ఎటువంటి ఆదాయం ఉండదని చెప్పి పెద్ద ప్రజలు ఇబ్బందులు గుర్తించకుండా జాప్యం చేస్తున్నారు గత కొద్ది రోజుల క్రితం అదే గ్రామంలో పడవ బోల్తా పడి తృటిలో ప్రమాదం తప్పింది అప్పుడు అక్కడికి కలెక్టర్ వచ్చి మీకు బ్రిడ్జి వేపిస్తాను అని చెప్పి ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోవటం లేదు ఈ అధికారులు ఈ వైస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కేవలం డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదు రాబోయే రోజుల్లో మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ఈ బ్రిడ్జ్ కోసం కోమటిలంక గ్రామ ప్రజలకి అన్ని రకాలుగా అండగా ఉంటామని జనసేన నాయకులు తాతపూడి చందు అన్నారు.