సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన పాలవలస యశస్వి

*ప్రజలంతా కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
*కోవిడ్ నిబంధనలతో పండుగ జరుపుకోవాలని పిలుపు.
*పండగపూట రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోన్న వైస్సార్సీపీ ప్రభుత్వం

విజయనగరం, గురువారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి జిల్లా ప్రజలకు గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ కేసులు అమాంతంగా పెరుగుతున్న తరుణంలో కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అందరూ మాస్కులు విధిగా ధరించి,చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్ చేసుకుంటూ, ప్రజలు గుమిగూడిన ప్రదేశాలలో తిరగకుండా భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. పండుగ అనగానే ప్రయాణాలు పరిపాటి, పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని అత్యవసర పనుల కోసం తప్పా, ఊరకనే పండుగురోజుల్లో బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా కుటుంబ సభ్యులతో ఇంట్లోనే పండుగ జరుపుకోవాలని అన్నారు. త్వరలోనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జనసైనుకుల ద్వారా మాస్కులు, శానిటైజర్లు, పంచిపెడతామని అన్నారు. రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందని, పండిన పంటలు ఇంటికొచ్చిన వేళలో జరుపుకొనే ఈ సంక్రాంతి పండుగలో ప్రస్తుత వైస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలోను, మరియు జిల్లాలోను రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ధాన్యం కొనుగోలు చేయకుండా పండగంటిపూట రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోన్న ప్రభుత్వంగా ఈ వైస్సార్సీపీ చరిత్రలో నిలుస్తోందన్నారు.