తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ మేరకు మంగళవారం నాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగువారి సంస్కృతి సంప్రందాయాలకు, ప్రత్యేక కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతాంగాని మనమిచ్చే గౌరవానికి సంక్రాంతి పర్వదినం ప్రతీక అని అన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను తెలుగు వారంతా సంతోషంగా జరపుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.