రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ

మదనపల్లె: భారతీయ కుటుంబ విలువలకు, అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల ఆత్మీయత, అనురాగాలకు ప్రతీక రాఖీ పండుగ, ప్రేమ, అనుబంధంతో రక్షాబంధన వేడుకను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, టమోటా మార్కెట్ చైర్మన్ జంగాల శివరామ్ అన్నారు.‌ ఆనందోత్సాహాల నడుమ రాఖీ పండుగ జరుపుకుంటున్న సోదర, సోదరీమణులకు రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మదనపల్లె కమ్మవీధి జనసేన పార్టీ కార్యాలయంలో వితంతువులు, ఆడపడుచులకు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, టమోటా మార్కెట్ చైర్మన్ శివరామ్ రాయల్ చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ వీర మహిళలు, అభిమానులు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‌ ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ సోదరులకు సోదరి రాఖీ కట్టి సంతోషంగా ఉండాలని, తనకు అన్నివిధాలా రక్ష ఇవ్వాలని ఆకాంక్షిస్తారని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ దేశ వ్యాప్తంగా అనాధ శరణాలయం లలో నివసిస్తున్న తల్లి, తండ్రి లేని పిల్లలు, కొడుకు కూతురు వదిలేసిన వృద్ధులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారని కొనియాడారు. వారిని దేవుని బిడ్డలు అని సంబోధించడం అయన గొప్ప తనానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.‌ ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీలు సనావుల్లా, గజ్జల రెడ్డప్ప, మదనపల్లి రూరల్ అధ్యక్షులు రోణూరు బాబు, రామసముద్రం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మీపతి, రూరల్ ఉపాధ్యక్షులు సువారపు చంద్రశేఖర్, టౌన్ ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డెమ్మ, జనరల్ సెక్రటరీ వరికొల్ల నాగరాజు, టౌన్ సెక్రటరీ మేకలచెర్వు అర్జున, పద్మావతి, జనార్ధన్, నాగవేణి, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లిక, గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, లక్కసముద్రం కిరణ్ కుమార్ రెడ్డి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment