కోవిషిల్ట్ వ్యాక్సిన్‌ పై సీరం సీఈఓ విజ్ఞప్తి

కరోనావైరస్  ప్రపంచంచాన్ని గడ గడలాడిస్తుంది. లక్షలాది మంది మరిణించారు. భారత దేశంలో 33 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇలాంటి సమయంలో కోట్లాది మంది భారతీయులు వ్యాక్సిన్ కోసం వేచి చూస్తున్నారు.

పూణెకు చెందిన సీరం ఇన్ స్టిట్యూట్, ఆక్స్ ఫర్ట్ నిర్వహిస్తున్న ట్రయల్స్ ప్రస్తుతం వేగాన్ని పుంజుకున్నాయి. అయితే హ్యూమన్ ట్రయల్స్ గురించి, టీకా విడుదల తేదీ గురించి ప్రస్తుతం పలు వార్తలు వస్తున్నాయి. దీనిపై సీరం ఇన్ స్టిట్యూట్ సీఈఓ ఒక విజ్ఞప్తి చేశారు.

ఆక్స్‌ఫర్డ్‌కి చెందిన కోవిషిల్ట్ వ్యాక్సిన్‌ను సీరం ఇనిస్టిట్యూట్ వాలంటీర్లపై ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాలేదని అదార్ తెలిపారు. మరో రెండునెలల్లో పూర్తవుతోందని పేర్కొన్నారు. అప్పటివరకు మీడియా ఓపిక పట్టాలని కోరారు. ఒకసారి క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ పూర్తయితే.. తామే సమాచారాన్ని ప్రజలకు అందజేస్తామని వివరించారు. ఇందులో గోప్యానికి తావులేదని చెప్పారు. కానీ మధ్యలో రిపోర్ట్ చేయడం వల్ల ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది అని చెప్పారు.