తెనాలి నియోజకవర్గ రైతులకు శ్రీ నాదెండ్ల పరామర్శ

పంట నష్టంపై ఆరా

గుంటూరు జిల్లా, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం నందివెలుగు, కుంచవరం గ్రామాల పరిధిలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటల వివరాలు తెలుసుకున్నారు. స్వయంగా పడిపోయిన పొలాల వద్దకు వెళ్లి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఎన్ని ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది..? ఎంత శాతం నష్టం జరిగింది..? అనే అంశాలను రైతులను అడి తెలసుకున్నారు. జనసేన పార్టీ రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.