జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ధర్మపురి జనసేన తరపున చిరు సహాయం

ధర్మపురి మండలం, బుద్దేషాపల్లికి చెందిన జాడి మనోహర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత 20 సంవత్సరాలుగా బోధకాలతో బాధపడుతున్నాడు. ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేసారు. సర్జరీ చేయాలి అని డాక్టర్ చెప్పారట. సర్జరీ చేయడానికి 10 లక్షలు ఖర్చు అవుతుందట. దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదు. నిండు పేదరికం. ఇట్టి విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు నాయకులు మా వంతుగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ధర్మపురి జనసేన పార్టీ పక్షాన 5000/- రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయం చెప్పగానే స్పందించి దొనతె చేసిన సభ్యులు ఒడ్డేటి కరుణాకర్, సంగనబట్ల వినయ్, ముత్యాల వినోద్, అయ్యోరి సాయి, దొంతమల్ల లక్ష్మణ్ కి కృతజ్ఞతలు. అలాగే ఖర్చుతో కూడుకున్నది కనుక ప్రభుత్వం తరపున కూడా సహాయం చేసి ఆదుకోవాలి అని కోరుతున్నాము. అలాగే దయచేసి మానవతా వాదులు స్పందించి తోచినంత సహాయం చెయ్యగలరు అని కోరుకుంటున్నాము. ఇప్పుడు మీరు పంపించే ప్రతి రూపాయి వాళ్ళకి చాలా విలువ అయినది.