కష్టాల్లో ఉన్న సహచర మిత్రునకు ఆర్థిక సహయం చేసిన జనసైనికులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-22-at-9.48.59-PM-1-1024x461.jpeg)
అగనంపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ 2008-09 సంవత్సరంలో ఎస్ఎస్సి బ్యాచ్ కు చెందిన తమ తోటి సహచర విద్యార్థి నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి బాల బహుదూర్ పెద్ద కుటుంబంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తన బ్యాచ్ కి చెందిన జనసైనికులు జీవీఎంసీ 85వ వార్డు జనసేనపార్టీ ఇన్చార్జ్ గవర సోమశేఖర్ రావు చేతుల మీదుగా రూ. 8000/- ఆర్థిక సహాయం అందజేసి ఆదుకున్నారు. తమ సహచర మిత్రుడును కష్టాలలో ఆర్థికంగా ఆదుకున్న జనసైనికులను ముఖ్యంగా ఈ గ్రూప్ ని చొరవ తీసుకుని ముందుకు నడిపిస్తున్న పిల్లా శివ కుమార్ని మరియు ఇతర బ్యాచ్ సభ్యులను అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా ఇతరులకు చేతనైన సహాయం చేయవలసిందిగా గవర సోమశేఖర్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు ఇతర సహచర మిత్రులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-22-at-9.48.58-PM-1024x461.jpeg)