JEE-NEET విద్యార్ధులకు సోనూసూద్ హామీ

ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో సోసూసూద్ ఎప్పుడూ ముందుంటాడు. వలస కూలీలను వారి గమ్యస్థానానికి చేర్చడం కానివ్వండి, విదేశాల నుంచి భారతీయులను రప్పించడం ఇలా సోనూ సూద్ చేసిన సహాయాలు అన్ని ఇన్నీకాదు.  తాజాగా ఇప్పుడు స్టూడెంట్స్.. ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లలేమని బెంగ వద్దు.. ప్రైవేట్ రవాణా ఛార్జీలు చెల్లించలేమని ఆందోళన వద్దు.. మీకు నేనున్నానంటున్నారు సోనూసూద్. నీట్, జేఈఈ పరీక్షల నేపధ్యంలో ఈ రియల్ హీరో మరోసారి సాయం చేసేందుకు రంగంలోకి దిగారు. ఒక వేళ జేఈఈ, నీట్ పరిక్షలు జరిగితే.. మీరు ఖంగారు పడకండి. మీరు ఎక్కడికైనా వెళ్లాలి అనుకుని మధ్యలో ఇరుక్కోపోతే.. నన్ను సంప్రదించండి. నేను మీకు సహాయం చేస్తాను. సహాయం లేకపోవడం వల్ల ఎవరూ పరీక్షలు మిస్ అవ్వకూడదు అని ట్వీట్ చేశాడు.