పొన్న యుగంధర్ కోలుకోవాలని ద్రౌపదమ్మ గుడిలో ప్రత్యేక పూజలు

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: ఇంచార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డా. యుగంధర్ పొన్న గారికి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. మా నాయకుడి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని వెదురుకుప్పం ద్రౌపదమ్మ గుడిలో పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, నియోజకవర్గం బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, మండలం యువజన అధ్యక్షులు కావలి సతీష్, నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షులు సతీష్, మండలం ప్రధాన కార్యదర్శి నక్కా ముని, మండలం ఉపాధ్యక్షులు మునిరత్నం, మండలం ప్రధాన బెనర్జీ, సీనియర్ నాయకులు శేఖర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.