జనసేనాని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు

పి.గన్నవరం నియోజకవర్గం: మామిడికుదురు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆదుర్రు బౌద్ధ స్తూపం వద్ద అమలాపురం పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ డిఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడి కుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, ఆదుర్రు సర్పంచ్ బల్ల శ్రీనివాస్, అమలాపురం మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు ఏడిద శ్రీను, ఎస్ ఆర్ ఆర్ భూపతి మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.